విద్యార్థినులు వద్దని వేడుకున్నా బలవంతంగా కత్తిరించినట్టు ఆరోపిస్తున్నారు. కొందరు దేవుడి మొక్కు ఉందని చెప్పినా కనికరించలేదని చెబుతున్నారు. విద్యార్థినుల జుట్టు కత్తిరించడంపై కేజీబీవీ ప్రిన్సిపాల్ సాయి ప్రసన్నను వివరణ ఇచ్చారు. విద్యార్థినుల జుట్టు బాగా పెరిగిపోవడంతో పేలు పట్టి, తలపై కురుపులు వస్తాయని, క్రమశిక్షణగా ఉంటారనే ఉద్దేశంతోనే కట్ చేసినట్లు తెలిపారు. విద్యార్థినుల ఆరోపణల్లో వాస్తవం లేదని సాయిప్రసన్న తెలిపారు. మరోవైపు ఈ ఘటన తమ దృష్టికి వచ్చిదని ఎంఈవో బాబూరావు తెలిపారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. బాలికల జుట్టు కత్తిరించడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు సిద్ధం అవుతున్నారు.
Home Andhra Pradesh తరగతులకు ఆలస్యంగా వచ్చారని విద్యార్థినుల జుట్టు కత్తిరించిన కేజీబీవీ స్పెషలాఫీసర్-kgbv special officer who cut...