ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అయితే మరో రెండు నెలలు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6న నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. ఇటీవల ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ ఇంకా పూర్తి కాకపోవడంతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. ఏపీలో ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను ఏర్పాటుచేసింది. రెండు నెలల్లో ఎస్సీ వర్గీకరణపై నివేదిక ఇవ్వాలని కమిషన్ ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నివేదిక వచ్చిన తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి డీఎస్సీ నియామకాలు పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్ ఇటీవల అసెంబ్లీలో ప్రకటన చేశారు.
Home Andhra Pradesh ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మరో రెండు నెలలు ఆలస్యం, కారణమేంటంటే?-ap mega dsc notification...