తెలుగు చిత్ర సీమలో వైవిధ్యమైన చిత్రాలని ప్రేక్షకులకి అందించే హీరోల్లో నారా రోహిత్(nara rohit)కూడా ఒకడు. తన మొదటి సినిమా బాణం దగ్గరనుంచి మొన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎలక్షన్స్ కి ముందు వచ్చిన ప్రతిధ్వని పార్ట్ 2 చిత్రాలే అందుకు ఉదాహరణ.శనివారం నాడు అయన తండ్రి మాజీ ఎంఎల్ఏ నారా రామ్మూర్తి నాయుడు చనిపోయిన విషయం తెలిసిందే.
కార్డియో రెస్పిరేటరీ సమస్యల కారణంగానే రామ్మూర్తి నాయుడు(ramamurthy naidu)చనిపోయారు. కార్డియో రెస్పిరేటరీ అంటే శరీరంలో అన్ని కణాలకు ప్రవహించే రక్త ప్రసరణ ఒక్కసారిగా హఠాత్తుగా ఆగిపోతుంది. ఈ కారణంతోనే పద్నాలుగవ తారీఖున ఆయనకి గుండె పోటు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.దీంతో డాక్టర్స్ స్టంట్ కూడా వేయడం జరిగింది. కొంత కోలుకుంటున్నారు అనే లోపే గతంలోనే ఆయనకి ఉన్న శ్వాస కి సంబంధించిన కారణాల వల్ల పల్మనరీ ఇష్యుస్ ట్రిగర్ అవడంతో పాటుగా ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఎక్కువ అవ్వడంతో సీపాప్ ద్వారా కృత్రిమంగా శ్వాస కూడా అందించడానికి డాక్టర్స్ ట్రై చేసారు.
కానీ పదహారవ తేదీ ఉదయం మళ్ళీ కార్డియాడిక్ అటాక్ అవ్వడంతో చనిపోవడం జరిగింది.నిన్న ఆయన స్వగ్రామం నారావారి పల్లె లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu naidu)కి రామ్మూర్తి నాయుడు తమ్ముడున్న విషయం తెలిసిందే.