ఇక రెండో దశలో జాన్ పీరీల నుంచి కీర్తినగర్, కోటి లింగాల, ఏనుమాముల, కొత్తపేట నుంచి ఆరెపల్లి వరకు దాదాపు 8 కిలోమీటర్ల మేర కనెక్ట్ కావాల్సి ఉంది. భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగలేదు. భూములు కోల్పోతున్న వారికి పరిహారం కోసం రూ.50 కోట్లు అంచనా వేయగా.. రైతులు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. సర్వేల కోసం వెళ్లిన అధికారులను అడ్డుకుంటున్నారు. భూనిర్వాసితులకు పరిహారం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.30 కోట్లు అదనంగా పెంచి, మొత్తంగా రూ.80 కోట్లు రింగ్ రోడ్డు కోసం రిలీజ్ చేసింది. తొందర్లోనే ఈ పనులు కూడా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.