మచ్చలేని, మెరిసే చర్మం కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఇందుకోసం పలు రకాల ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తో పాటు హోం రెమెడీస్ ను ప్రయత్నిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఇంట్లో పాటించే పద్ధతుల్లో పసుపు, గంధం, శనగపిండి, పెరుగు వంటివి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే అరబిక్ మహిళలను చూడండి… వారు పింక్ షేడ్ బుగ్గలతో మెరిసిపోతారు. వారికి ఆ గులాబీ రంగు ఎలా వస్తుందో తెలుసుకోవాలని చాలా మంది కోరుకుంటారు. వారు నివసించే వాతావరణం వల్ల కూడా ఆ రంగు వస్తుందని అనుకుంటారు. నిజానికి వారు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఆ పింక్ రంగు వస్తుందని ఇన్ స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్గా ఉన్న ఓ పాకిస్తానీ డాక్టర్తన సోషల్ మీడియాలో ఒక పోస్టును షేర్ చేసుకుంది. ఈ చిట్కాలు పాటించడం ద్వారా అరబిక్ మహిళల మాదిరిగా గులాబీ, ప్రకాశవంతమైన, మృదువైన చర్మాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ అమేజింగ్ హోం రెమెడీని ఎలా ఫాలో అవ్వాలో తెలుసుకోండి.