ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(pushpa 2)డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న విషయం తెలిసిందే.ఇటీవల రిలీజైనట్రైలర్ ఒక రేంజ్ లో ఉండటంతో అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా పుష్ప పార్ట్ 2 పై భారీ అంచనాలే ఉన్నాయి.తెలుగుతో పాటు మొత్తం ఐదు లాంగ్వేజ్ లో విడుదలైన ట్రైలర్ ఇప్పుడు రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుపోతుంది.ఇప్పడు మరో రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.
ఓవర్సీస్ కి సంబంధించి యుఎస్ లో పుష్ప 2 ప్రీమియర్ ప్రీ సేల్స్ బుకింగ్స్ ని ఓపెన్ చెయ్యగా, టికెట్స్ అన్ని కూడా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఏకంగా వన్ మిలియన్ డాలర్ల కి పైగా రాబట్టి తన సత్తా చాటింది. యుఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యంత వేగంగా వన్ మిలియన్ డాలర్ల మార్కుని సాధించిన మొట్ట మొదటి భారతీయ చిత్రంగా కూడా నిలిచింది.దీంతో సిల్వర్ స్క్రీన్ వద్ద పుష్ప రాజ్ ఆధిపత్యం సరికొత్త డైమన్షన్ని క్రియేట్ చేసినట్లయ్యింది. రిలీజ్ టైంకి రోజుకొక రికార్డుని తన ఖాతాలో వేసుకొని సరికొత్త చరిత్రని కూడా సృష్టించడం ఖాయమని సినీ ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండంతో పుష్ప పార్ట్ 2 కి సంబంధించిన ప్రమోషన్స్ లో వేగం కూడా పెరగనుంది.అల్లు అర్జున్ సరసన రష్మిక(rashmika)జత కడుతుండగా శ్రీలీల(sreeleela)ఒక ప్రత్యేక గీతంలో చేస్తుంది.అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఐదు వందల కోట్ల భారీ బడ్జట్ తో నిర్మించగా సుకుమార్(sukumar)దర్శకత్వాన్ని వహించాడు.జగపతి బాబు, ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ వంటి తారలు ముఖ్య పాత్రల్లో కనపడుతున్నారు.