ఈపీఎఫ్ సభ్యుడిగా ఎన్నాళ్లు కొనసాగవచ్చు?
ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టిన లేదా రిటైర్ అయిన తర్వాత కూడా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుడిగా కొనసాగవచ్చు. ఈపీఎఫ్ఓ సభ్యత్వానికి వయస్సు పరిమితి లేదు. అయితే, ఈపీఎఫ్ ఖాతాలోని నిధులపై వడ్డీ చెల్లించడానికి, ఉద్యోగి-యజమాని సంబంధం, నెలవారీ కంట్రిబ్యూషన్లు కొనసాగుతూ ఉండాలి. ఇటీవలి సవరణ ప్రకారం, ఉద్యోగి 55 సంవత్సరాల వయస్సు తర్వాత పదవీ విరమణ చేస్తే, ఆ తరువాత ఖాతాదారుడు ఈపీఎఫ్ కార్పస్ ను ఉపసంహరించుకోకపోతే ఖాతాకు చివరి యజమాని కంట్రిబ్యూట్ చేసిన తేదీ నుండి 36 నెలల తర్వాత వడ్డీ వసూళ్లు ఆగిపోతాయి. అంటే క్రియాశీల కంట్రిబ్యూషన్లు ఆగిపోయిన తర్వాత, ఫండ్స్ (employee provident fund) వడ్డీని పొందడం కొనసాగిస్తాయి. అయితే ఇది ఖాతాదారుడి రేటు వద్ద పన్ను పరిధిలోకి వస్తుంది.