శబరిమలలో నెలవై ఉన్న అయ్యప్ప స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు కఠిన దీక్ష చేపడతారు. కార్తీక మాసం మొదలుకొని మాస సంక్రాంతి వరకూ నలబై ఒక్క రోజుల పాటు నియమ నిష్టలతో స్వామిని కొలుస్తారు. మొదటి రోజు నుంచి చివరి వరకూ భక్తిశ్రద్ధలతో స్వామిని ఆరాధించి భక్తితో ఒక ముడి, శ్రద్ధతో మరో ముడి వేసి ఇరుముడితో శబరిమల చేరుకుంటారు. ఈ 108 పేర్లను పఠించిన వారు అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు, శాంతి, రక్షణ పొందుతారు. ప్రతి పేరులో అయ్యప్ప స్వామి దైవిక గుణాలు, లక్షణాలు, ఆయన రక్షణాత్మక స్వభావాన్ని తెలియజేస్తాయి. ఈ పేర్లను 41 రోజుల దీక్షా సమయంలో లేదా శబరిమల ఆలయ యాత్రకు వెళ్ళేటప్పుడు, అలాగే అయ్యప్ప స్వామికు అంకితం చేసిన ఇతర పూజా కార్యక్రమాల సమయంలో సాధారణంగా పఠిస్తారు. ఆ నామావళి మీరు కూడా తెలుసుకోండి. స్వామి వారి అనుగ్రహం పొందండి.