కొత్త సినిమా విడుదలైతే చాలు, పలు యూట్యూబ్ చానల్స్ థియేటర్స్ దగ్గర సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పబ్లిక్ టాక్ ని తీసుకోవడం తెలిసిందే.దాంతో పాటే మూవీపై కొంత మంది నెటిజన్స్ విశ్లేషణని కూడా ఇస్తుంటారు.వాళ్ళు ఇచ్చే రివ్యూస్ ప్రేక్షకులపై ప్రభావం చూపడంతో పాటుగా సినిమాపై కూడా ఆ ప్రభావం పడుతుందని తమిళ ఫిలిం యాక్టివ్ ప్రొడ్యూస్ అసోసియేషన్(Tamil film active producers association)ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది విడుదలైన చాలా చిత్రాలపై రివ్యూలు ప్రభావం చూపించాయి.ముఖ్యంగా ఇండియన్ 2 ,వేట్టయ్యన్,కంగువా ఫలితాలపై పబ్లిక్ టాక్,యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చే విశ్లేషణలు ఎంతగానో ప్రభావాన్ని చూపించాయి.రాను రాను చిత్ర పరిశ్రమకి ఇదొక సమస్యగా మారుతుంది.దీనిని కట్టడి చేసేందుకు పరిశ్రమలోని అన్ని సంఘాలు ఏకమయ్యి పరిశ్రమ అభివృద్ధికి  కృషి చెయ్యాల్సిన అవసరం ఉంది.ఇక నుంచి థియేటర్ యజమానులు యూ ట్యూబ్ చానల్స్ ని థియేటర్ ప్రాంగణంలోకి అనుమతించకూడదు.

ఫస్ట్ డే,ఫస్ట్ షో సమయంలో థియేటర్ వద్ద పబ్లిక్ రివ్యూలకి అవకాశం కల్పించకూడదు.రివ్యూ ల పేరుతో దర్శక, నిర్మాతలపై వ్యక్తి గత విమర్శలని కూడా ఖండిస్తున్నాం.ఇక అలాంటి వాటికీ పాల్పడితే అంగీకరించే పని లేదని తమిళ ఫిలిం యాక్టివ్ ప్రొడ్యూస్ అసోసియేషన్  సోషల్ మీడియా వేదికగా  తెలిపింది ప్రముఖ హీరోయిన్, నిర్మాత జ్యోతిక కూడా యూ ట్యూబ్ చానల్స్ ఇచ్చే రివ్యూల వల్లే సినిమా ఫలితాల్లో తేడాలు వస్తున్నాయని చెప్పుకొచ్చింది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here