మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి(vijay sethupati)హీరోగా జూన్ 14 న పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజైన మూవీ మహారాజ(maharaja)నిదిలన్ స్వామినాథన్(nithilan swaminathan)రచనా దర్సకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ  తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ మంచి విజయాన్ని అందుకుంది.ఒక కొత్త రకం స్క్రీన్ ప్లే ని పరిచయం చేసిన ఈ మూవీ ఓటిటి వేదికగా కూడా భారీ రెస్పాన్స్ ని రాబట్టింది.ముఖ్యంగా విజయ్ సేతుపతి నటనకైతే ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. 

ఇప్పుడు ఈ మూవీ నవంబర్ ఇరవై తొమ్మిదిన చైనా(china)లో నలభై వేల స్క్రీన్లలో రిలీజ్ కాబోతుంది. చాలా సంవత్సరాల నుంచి  పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న సినిమాలన్నీ కూడా చైనా లో రిలీజ్ అవుతూనే వస్తున్నాయి. వాటిల్లో ఇంతవరకు ఏ  ఇండియన్ సినిమా కూడా మహారాజ మూవీలాగా నలభై వేల స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వలేదు.రజనీ కాంత్ సినిమాలకి ఎప్పట్నుంచో చైనాలో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే . అలాంటిది రజనీ సినిమా కూడా మహారాజ స్థాయిలో  రిలీజ్ అవ్వలేదు.అలాంటిది విజయ్ సేతుపతి ఒక  అరుదైన రికార్డుని అందుకున్నాడని చెప్పవచ్చు.

బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్(anurag kasyap)విలన్ గా నటించగా అభిరామి, దివ్య భారతి, సచనా, మమతా మోహన్ దాస్, నటరాజ్ సుబ్రమణ్యం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. యిషి ఫిల్మ్స్ ,అలీబాబా పిక్చర్స్ సంయుక్తంగా మహారాజా ని చైనాలో  రిలీజ్ చేస్తున్నాయి.మరి చైనా ప్రేక్షకులు మహారాజ ని ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here