ఇందులో 8జీబీ ర్యామ్ వస్తుంది. 8జీబీ వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. ఫిజికల్ ర్యామ్‌తో 16జీబీని ఉపయోగించవచ్చు. 256జీబీ స్టోరేజ్ ఎంపిక, 2టీబీ మైక్రో ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇది ఓఐఎస్, ఈఐఎస్ మద్దతుతో 50-మెగాపిక్సెల్ సోనీ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.