‘తెలంగాణలో ఎలక్రిక్ వాహనాలు అన్ లిమిటెడ్ గా కొనుక్కోవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలకు అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్లు ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు చొరవ తీసుకొని ఛార్జింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేయాలి. ఈవీ వాహనాలకు సంబంధించి గతంలో 5 వేల వెహికిల్స్‌కే టాక్స్ మినహాయింపు ఇచ్చారు. ఇప్పటి వరకు లక్షా 70 వేల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇప్పటి వరకు రోజుకు ప్రతి వంద వాహనాలలో 5 ఎలక్ట్రిక్ వాహనాల వస్తున్నాయి. వచ్చే 10 రోజుల్లో రవాణా శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ పోలీసులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తాం’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.