ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ముందు, వెనక భాగంలో డిస్క్ బ్రేక్ ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ సస్పెన్షన్ సెటప్ గురించి చూస్తే.. స్కూటర్ ముందువైపు టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోర్కులు, వెనక వైపున హైడ్రాలిక్ మోనో షాక్ అబ్జార్బర్ సెటప్ ఉన్నాయి. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఐదు అంగుళాల డిజిటల్ టీఎఫ్‌టీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది వీఎల్ఎఫ్ టెన్నిస్‌కు స్పీడోమీటర్‌గా పనిచేస్తుంది. ఇందులో ఎకో, కంఫర్ట్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉంటాయి.