ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)డిసెంబర్ 5 న పుష్ప పార్ట్ 2(pushpa part 2)తో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల పాట్నా వేదికగా రిలీజైన ట్రైలర్ ఒక రేంజ్ లో ఉండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి .2021 లో వచ్చిన పుష్ప పార్ట్ 1 కి కొనసాగింపుగా ఈ మూవీ తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే.
పుష్ప పార్ట్ 1 సమయంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త గరికపాటి నర్సింహారావు(garikapati narasimha rao)పుష్ప మూవీపై మాట్లాడుతూ స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించారు. అదేంటని అడిగితే చివరలో మంచిగా చూపిస్తాం.లేకపోతే పుష్ప 2 తీస్తాం, అది కూడా సరిపోకపోతే పార్ట్ 3 తీస్తామంటారు.నువ్వు తీసే వరకు సమాజం చెడిపోవాలా.ఈ సినిమా కారణంగా స్మగ్లింగ్ గొప్ప అనే భావన వస్తుంది కదా. పైగా స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలే అంటాడా. అది పెద్ద ఉపనిషత్తు సూక్తి అయిపోయింది.
ఎవడైనా కుర్రాడు గూబ మీద కొట్టి తగ్గేదేలే అంటే దానికి కారణం ఎవరు.ఇలాంటి విషయాలు మాట్లాడితే కోపమే వస్తుంది. ఈ విషయంలో హీరో, డైరెక్టర్ నాకు సమాధానం చెప్పమనండి.అలాంటి డైలాగుల వల్ల సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి.తగ్గేదే లే అని సమాజహితం కోరే హరిశ్చంద్రుడు,శ్రీరామచంద్రుడు వంటి వారు అనాలని చెప్పడం జరిగింది.పుష్ప పార్ట్ 2 రిలీజ్ నేపథ్యంలో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.