అరచేతిపై గురు పర్వతం గుర్తు..
హస్త సాముద్రికం ప్రకారం అరచేతిలోని గురు పర్వతంలో ఏదైనా గుర్తు ఉన్న వ్యక్తి కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తాడు. దీంతోపాటు చేతిరేఖలపై త్రిభుజం లాంటి త్రికోణ చిహ్నం ఉంటే లేదా విధి రేఖను తాకే ఏదైనా రేఖ ఉంటే అటువంటి వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. చేతుల్లో గీతలు స్పష్టంగా లేకపోవడం, గీతలు తెగిపోయిన వారు ప్రభుత్వ ఉద్యోగం పొందడంలో నానా తంటాలు పడుతుంటారు. కానీ, డబ్బు కొరత లేకుండా కాలం గడిపేస్తుంటారు.