సూపర్ స్టార్ కృష్ణ(krishna)మనవడు,మహేష్ బాబు(mahesh babu)మేనల్లుడు అశోక్ గల్లా(ashok galla)ఈ రోజు’దేవకీ నందన వాసుదేవ'(devaki nandana vasudeva)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఆర్ఎక్స్100 ఫేమ్ కార్తికేయ హీరోగా వచ్చిన గుణ 369 సినిమాని తెరకెక్కించిన అర్జున్ జంధ్యాల(arjun jandyala) దర్శకుడు కాగా  హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ(prashanth varma)కథని అందించగా సోమినేని బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరించాడు.

ఇక చిత్రం రిలీజ్ సందర్భంగా అశోక్ మీడియాతో మాట్లాడుతూ మా మూవీ ఆధ్యాత్మిక అంశాలతో తెరకెక్కిందే గాని, హనుమాన్ తరహాలో దేవుణ్ణి చూపించటంలేదు. నా క్యారక్టర్ పేరు కృష్ణ,హీరోయిన్ పేరు సత్యభామ,ప్రతి నాయకుడు కంసుడు.నా పాత్రకు ఒక గండం ఉండటంతో పాటుగా సినిమాలో కనిపించే కృష్ణుడి విగ్రహానికి కథకి ఒక లింక్ ఉంటుంది.ఇలా మూవీ ఆధ్యంతం మైథాలజీ మెటాఫర్ ఉంటూ బోలెడన్ని ట్విస్ట్ లు వస్తుంటాయి.

చిత్ర ప్రారంభంలో మూవీ చూస్తుంటే మురారి గుర్తుకొస్తుంది.కానీ ఆ కధకు,మా మూవీకి పోలిక ఉండదు.ప్రశాంత్ వర్మ కథని బోయపాటి స్టైల్లో తీస్తే ఎలా ఉంటుందో మూవీ అలా ఉంటుంది.దర్శకుడు అర్జున్ జంద్యాల కూడా  గొప్పగా ఎలివేట్ చేసి చూపించాడని చెప్పుకొచ్చాడు.

 

  


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here