గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో అయ్యప్ప స్వాములు ఫిర్యాదు చేశారు. గ్లోబల్ స్టార్ తన చర్యల ద్వారా అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే అయ్యప్ప దీక్షలో ఉండి కడప నగరంలోని దర్గాను దర్శించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. మాలధారణ దుస్తుల్లో ఉన్న రామ్ చరణ్ కడప అమీన్ పీర్ దర్గాలో ప్రార్థనల్లో పాల్గొన్నారు.