ఎమోషనల్ అవ్వకు
తర్వాత యష్మీ, విష్ణుప్రియ, పృథ్వీ కలిసి రోహిణిని ఆటోలో నుంచి దిగేలా చేశారు. దాంతో రోహిణి అవుట్ అయింది. మీ ముగ్గురిలో ఎవరు ఎవరిని తోసుకుంటారో చూస్తాను అంటూ రోహిణి వెళ్లిపోయింది. తర్వాత విష్ణుప్రియ, పృథ్వీ కలిసి యష్మీని తోసేసారు. దాంతో యష్మీ తెగ ఫీల్ అయిపోయింది. “నేను నిన్ను తోయకుండా సపోర్ట్ చేశా” అని యష్మీ అంటే.. “ఎమోషనల్ అవ్వకు ఇది జస్ట్ గేమ్” అని పృథ్వీ చెప్పాడు.