వృషభ రాశి
ఈ రాశి వారికి శుక్ర గ్రహం మకర రాశిలో సంచరించినన్ని రోజులు అదృష్ట దినాలుగా ఉంటాయి. కుటుంబంలో మీ మాటకు, చేతలకు ప్రశంసలు అందుతాయి. మీరు సమాజంలో అందరి ప్రేమ, నమ్మకాన్ని అందుకుంటారు. వైష్ణవ ఆలయాలను , విష్ణు మూర్తితో సంబంధం ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మాటల ద్వారా మీదే విజయమని చెప్పాలి. మాట్లాడే మాటలలో ఒక మనోహరమైన గుణం ఉంటుంది. కుటుంబంలో అందరితో కలిసిపోయే గుణం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. డబ్బు సంపాదించడాన్ని ఇష్టపడతారు. ఇతరుల నుండి ఆర్థిక సహాయం ఆశించకుండా ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. మీ వద్ద ఉన్న డబ్బులో కొంత భాగాన్ని ఇతరుల కోసం ఖర్చు చేస్తారు.