ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా వేదికగా ప్రసారమయ్యే నందమూరి బాలకృష్ణ(balakrishna)వన్ మాన్ టాక్ షో అన్ స్టాప్పబుల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.ఇప్పటికే మూడు సీజన్లని పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాలగవ సీజన్ లో మొదటి నాలుగు ఎపిసోడ్ లని పూర్తి చేసుకుంది. 

రీసెంట్ గా ప్రారంభమయిన ఐదో ఎపిసోడ్ కి గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)వచ్చిన విషయం   తెలిసిందే.మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ ఎపిసోడ్ లో మొదటి భాగం ఇటీవలే టెలికాస్ట్ అవ్వగా,రెండవ భాగం రీసెంట్ గా టెలికాస్ట్ అయ్యింది.ఈ ఎపిసోడ్ లో బన్నీ తన కూతురు,కొడుకు తో కలిసి పాల్గొన్నాడు.బాలయ్యతో కలిసి ఆ ముగ్గురు చేసిన హంగామ,ఎంతో ఇంట్రెస్టింగ్ గా,ఎంటర్ టైన్ మెంట్స్ సాగడంతో పాటు,బాలయ్య,అర్హ(arha)మధ్య సరదా సన్నివేశాలు, అర్హ తెలుగు భాషకి సంబంధించి చెప్పిన పద్యం,తెలుగు మాటలు, అల్లు అర్జున్, చిరంజీవి(chiranjeevi)గురించి మాట్లాడిన మాటలు,ఇలా మొత్తం ప్రేక్షకులకి ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కారణంతోనే ఇప్పుడు  ఆ ఎపిసోడ్ దెబ్బకి గత ఓటిటి రికార్డులన్నీ చెల్ల చెదురు అయ్యి హయ్యెస్ట్ వ్యూస్ ని  సంపాదించిందని తెలుస్తుంది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here