బాలనటుడిగా అనేక చిత్రాల్లో నటించిన తేజసజ్జ(teja sajja)ఆ పై జాంబీ రెడ్డితో సోలో హీరోగా ఎంటర్ అయ్యి సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్(hanuman)తో భారీ విజయాన్ని అందుకున్నాడు.ఇక ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా రెండువందల నలబై దేశాల్లోప్రసారం కాబోతున్న ది రానా దగ్గుబాటి(rana daggubati)షో కి మొదటి ఎపిసోడ్ లో హీరో నాని(nani)తో పాటు తేజ సజ్జ కూడా పాల్గొన్నాడు.గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలోఆ మొదటి ఎపిసోడ్‌ను వరల్డ్ ప్రీమియర్‌గా ప్రసారం కూడా చేశారు
ఇక ఆ ఇంటర్వ్యూ లో తేజ మాట్లాడుతు సినిమా ఇండస్ట్రీలో వెయ్యికోట్ల మార్కెట్ కి ఒకే ఒక్క మొగుడు ప్రభాస్(prabhas)అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా నిలవడమే కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ లో అయితే ఎనలేని జోష్ ని తీసుకొస్తున్నాయి.బాహుబలి(baahubali)తో వెయ్యి కోట్లు సాధించిన ప్రభాస్, ఆ తర్వాత కల్కి(kalki)తో పదకొండు వందల కోట్లు సాధించిన విషయం అందరకి తెలిసిందే.