వెబ్ సిరీస్: గుటర్ గు

నటీనటులు : విశేష్ బన్సాల్, ఆశ్లేష ఠాకూర్ తదితరులు

రచన , ఎడిటింగ్: అక్షర ప్రభాకర్

సినిమాటోగ్రఫీ: శ్రీరామ్ గణపతి

సంగీతం: గౌరవ్ ఛటర్జీ

నిర్మాతలు :  అచిన్ జైన్, గునీత్ మోంగా

దర్శకత్వం: సాకిబ్ పండోర్

కథ:

అనూజ్ (విశేష్ బన్సాల్) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. తల్లి .. తండ్రి .. తమ్ముడు వినీత్ ఇదే అతని కుటుంబం. స్కూల్లో ఆది – అమర్ అతని బెస్ట్ ఫ్రెండ్స్. గుర్గావ్ నుంచి కొత్తగా భోపాల్ వచ్చిన రీతూ, అనూజ్ స్కూల్లో కొత్తగా జాయిన్ అవుతుంది. కాస్త ఆధునిక భావాలు ఉన్న తల్లి – తండ్రి .. అదే ఆమె ఫ్యామిలీ. రీతూ టాపర్. అనూజ్ ప్రవర్తన రీతూకి నచ్చుతుంది. దాంతో ఆమె అతనిని అభిమానించడం మొదలుపెడుతుంది. రీతూ పట్ల ఆకర్షితుడైన అనూజ్, ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. ఈ విషయం తెలిసి అది – అమర్ ఇద్దరూ కూడా అతనిని ఆటపట్టించడం మొదలెడతారు.  అనూజ్ కి అమిత్ అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. కాకపోతే అతను అనూజ్ కంటే చాలా సీనియర్. అతని పేరుతో రీతూ నంబర్ ను ఫోన్లో సేవ్ చేసుకుని, ఇంట్లో వాళ్లకి అనుమానం రాకుండా మాట్లాడుతూ ఉంటాడు.  రీతూ ఏ స్కూల్ నుంచి అయితే వచ్చిందో, ఆ స్కూల్ కి చెందిన సామ్రాట్ అనే కుర్రాడు, రీతూపై మనసు పారేసుకుంటాడు. ఇప్పుడు ఆమె అనూజ్ తో ప్రేమలో పడిన విషయం అతనికి తెలుస్తుంది. దాంతో అతను అనూజ్ కి కాల్ చేస్తాడు. రీతూను తాను లవ్ చేస్తున్నాననీ, ఆమె వెంట తిరగడం మానేయమని బెదిరిస్తాడు. మరి అనూజ్ తన ప్రేమ విషయం రీతూకి చెప్పాడా? సామ్రాట్ ఏం చేశాడనేది మిగతా కథ.

విశ్లేషణ:

యూత్ కుర్రాళ్ళ ఆలోచనలు, స్కూల్ అండ్ కాలేజ్ లైఫ్..‌ ఈ క్రమంలో వారిలో చిగురించే మొదటి ప్రేమ.‌‌ ఇలా కొన్నింటిని లింక్ చేస్తూ దర్శకుడు మంచి కథని ఎంచుకున్నాడు. ఎవరికైనా ఫస్ట్ లవ్ ఈజ్ ప్యూర్ అని చెప్తూనే ఆ లవ్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుందనేది చక్కగా చూపించాడు.

దర్శకుడు ఈ కథను చెప్పడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. అందువల్లనే తెరపై కథ స్లోగా సాగుతుంది.  కథలో ప్రతీ పాత్ర చాలా సహజంగా అనిపిస్తుంటుంది‌. ఎందుకంటే సహజత్వానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. ఎలాంటి హడావిడి లేకుండా సాఫీగా సాగుతుంది. దర్శకుడు ఇటు ఇల్లు .. అటు స్కూలు .. ప్రేమికులు కలుసుకునే ఏకాంత ప్రదేశాలకు సంబంధించిన సన్నివేశాలను డిజైన్ చేసుకున్న తీరు బాగుంది. 

కథ ఎంతసేపు నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలా అనిపిస్తుంది. అందుకే ఎక్కువగా ఎంగేజింగ్ చేయలేకపోయింది. గుటర్ గు అంటే పావురాల చప్పుడు.. ఈ సిరీస్ లో యూత్ ప్రేమ కోసం పడే తపన బాగుంది కానీ సరైన ట్రాక్ లో వెళ్ళలేదు. ఫ్యామిలీతో కలిసి చూడలేని సిరీస్ ఇది. అశ్లీల పదాలు ఉన్నాయనో లేక అడల్ట్ సీన్స్ ఉన్నాయనో కాదు..ఎదిగే పిల్లలకి ఎలా ప్రేమించాలో నేర్పేదిలా ఈ సిరీస్ ఉండటమే కారణం. అందుకే ఇది అన్ని వర్గాల వారికి నచ్చదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. ఒకే మ్యూజిక్. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు: అనూజ్ గా విశేష్ బన్సాల్, రీతూగా ఆశ్లేష ఠాకూర్ ఆకట్టుకున్నాడు. మిగతావారంతా వారి పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.

ఫైనల్ గా :  టీనేజర్స్ ని ఆకట్టుకునే ఈ కథ అందరికి నచ్చకపోవచ్చు. జస్ట్ వన్ టైమ్ వాచెబుల్.

రేటింగ్:  2.5 / 5

✍️. దాసరి  మల్లేశ్

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here