నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణం బీసీ కాలనీకి చెందిన సూరా రామకృష్ణా రెడ్డి, నారాయణమ్మ దంపతుల కుమారుడు ఉపేంద్ర రెడ్డి (29). రామకృష్ణారెడ్డి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నారాయణమ్మ కండక్టరుగా ఉద్యోగం చేస్తున్నారు. పిల్లలను మంచిగా చదివించాలనే ఆలోచనతో విదేశాలకు పంపించారు. కుమార్తె లక్ష్మీ భవానీని అమెరికా పంపించాగా, నాలుగేళ్ల కిందట ఎంఎస్ చేసేందుకు ఉపేంద్ర రెడ్డి జర్మనీ వెళ్లారు. చదువు పూర్తి చేసిన ఆయన ఇటీవలి అక్కడే కార్ల కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. మంచి ఉద్యోగంతో సంతోషంగా ఉంటూ ప్రతి రోజు ఉదయం ఇంటికి ఫోన్ చేసేవాడు.
Home Andhra Pradesh నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థి జర్మనీలో మృతి.. తల్లిదండ్రులకు అనుమానాలు-a student from nellore district...