మొక్కజొన్న రోటీ తయారీ విధానం
- స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నెయ్యి వేసి వేడి చేయాలి.
- అందులో వెల్లుల్లి రెబ్బల తరుగు వేసి బాగా వేయించుకోవాలి.
- సన్నగా తరిగిన మెంతి ఆకులను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
- ఆకులు మెత్తగా అయ్యే వరకు చిన్న మంట మీద వేయించండి.
- ఎండుమిర్చిని కాస్త నీళ్లు వేసి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకోవాలి.
- ఇప్పుడు అందులో కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
- ఆ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి.
- ఇప్పుడు ఆ కళాయిలోనే నీళ్లు వేసి మరిగించాలి, నీళ్లు వేడెక్కాక మొక్కజొన్న పిండిని వేసి ఉండల్లేకుండా కలుపుకోవాలి.
- ఆ మిశ్రమాన్ని చల్లార్చి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
- ఆ మిశ్రమంలోంచి చిన్న పిండిని తీసి చేత్తోనే చపాతీలా ఒత్తుకోవాలి. లేదా రోలింగ్ పిన్ తో ఒత్తుకున్నా ఫర్వాలేదు.
ఈ జొన్న పిండి రోటీ తినడం ఆరోగ్యానికి అన్నివిధాలా మంచిదే. ఇది పిల్లలకు, పెద్దలకు కూడా ఎంతో మేలు జరిగేలా చేస్తుంది. దీన్ని ఆకుకూరలతో వండిన కర్రీతో తిన్నా, చికెన్ కర్రీ, ఎగ్ బుర్జీ తో తిన్నా ఎంతో రుచిగా ఉంటుంది. మొక్కజొన్నలతో చేసే పిండిని ఒకసారి కొని తెచ్చుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రోటీలను చేసుకోవచ్చు. ఈ కార్న్ రోటీలో మనం కొత్తిమీర, వెల్లుల్లి, మెంతులు వేశాము, ఈ మూడు కూడా మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కాబట్టి వారానికి రెండు మూడు సార్లయిన ఈ రోటీని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.