ఎస్టీ-ఎక్స్ ఎలక్ట్రిక్ సైకిల్..
టాప్ ట్యూబ్ లేకపోవడం వల్ల ఎస్టీ-ఎక్స్‌ని తక్కువ ఎత్తు ఉన్న వ్యక్తులు కూడా నడపొచ్చు. ఈ రకమైన సైకిల్ ఫ్రేమ్‌లు సాధారణంగా మహిళా రైడర్ల కోసం ఉద్దేశించించి ఉంటాయి. ఎస్టీ-ఎక్స్ ఎత్తైన హ్యాండిల్ బార్ ఫ్రేమ్‌తో రైడింగ్‌ని సులభతరం చేస్తుంది. రైడింగ్ సౌలభ్యాన్ని పెంచే ఇతర హార్డ్వేర్లలో ఎర్గోనామిక్ హ్యాండిల్ బార్లు, అడ్జెస్టెబుల్ శాడిల్, స్లిమ్ డిజైన్ ఉన్నాయి. ఈ వస్తువులతో, ఎలక్ట్రిక్ బైసైకిల్ రోజువారీ ప్రయాణాలు, వారాంతపు ప్రయాణాలు, ఫిట్నెస్ దినచర్యలకు కూడా బాగా సరిపోతుంది.