ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్మెంట్ ను నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారభించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అర్హులైన విద్యార్థులు…రేషన్ కార్డు, అందులోని కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డుల జీరాక్స్ లు, తల్లి-విద్యార్థి పేరిట ఉన్న జాయింట్ అకౌంట్ పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో సమర్పించాలి. వీటితో పాటు దరఖాస్తు ఫారమ్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఫారమ్ సచివాలయాల్లో అందుబాటులో ఉంది. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ ప్రక్రియలో ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ చేయనున్నారు. స్కాలర్ షిప్ లను తల్లి, విద్యార్థి జాయింట్ అకౌంట్ లో జమ చేస్తారు. ఈ నెల 27 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించినట్లు సమాచారం. స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ కు అర్హులైన ఇంజినీరింగ్, డిగ్రీ, ఐటిఐ, పాలిటెక్నిక్ విద్యార్థుల వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here