ఎంపిక ప్రక్రియ
- అన్ని పోస్టులకు: ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటరాక్షన్
- అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఫైర్): షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటరాక్షన్
ఆన్లైన్ రాత పరీక్షను 2025 జనవరిలో నిర్వహిస్తారు. పరీక్ష కాల్ లెటర్ ను పరీక్షకు కొన్ని రోజుల ముందు బ్యాంక్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి, ఎస్ఎంఎస్, ఈ-మెయిల్స్ ద్వారా అభ్యర్థులకు సమాచారం ఇస్తారు. ఈ పరీక్షలో జనరల్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనే రెండు పేపర్లు ఉంటాయి. జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 90 నిమిషాలు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 45 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఆన్ లైన్ రాత పరీక్షలో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉండవు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ (100 మార్కులకు), ఇంటర్వ్యూ (25 మార్కులకు) మార్కులను కలిపి 70:30 వెయిటేజీతో తుది మెరిట్ జాబితాను రూపొందిస్తారు.