మరోవైపు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సూచించారు. ఖరీఫ్ పంట కోతల సమయం కావడంతో ధాన్యం తడిచిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. భారీ వర్షాలకు నాలుగైదు రోజులు సమయం ఉండటంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
Home Andhra Pradesh బంగాళాఖాతంలో అల్పపీడనం…! 25,26 తేదీల్లో ఏపీకి భారీ వర్ష సూచన-low pressure is likely to...