కుట్లూరు మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు ఆటోలో గార్లదిన్నె పని కోసం వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వారి స్వగ్రామానికి ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాంజమనమ్మ, బాల గద్దయ్య, డి.నాగమ్మ, నాగమ్మ ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన కూలీలను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిని ఎస్పీ, డీఎస్పీ పరిశీలించారు. ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు…ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here