ఇటీవల నవులూరు, బోరుపాలెం, నెక్కల్లు, కృష్ణాయపాలెం, తుళ్లూరు, వెలగపూడి, నిడమర్రు, అనంతవరం, మందడం గ్రామాలకు చెందిన 37 మంది రైతులకు 120 నివాస, 49 వాణిజ్య ప్లాట్లు అందించారు. భూములిచ్చిన రైతులకు దశల వారీగా రిటర్నబుల్‌ ప్లాట్లు కేటాయిస్తామని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడం ద్వారా.. అమరావతి ప్రాంతం అభివృద్ధి చెంది రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అధికారులు వివరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here