మునగాకు నువ్వుల పొడికి కావాల్సిన పదార్థాలు

  • అరకప్పు మునగాకు (అరబెట్టాలి)
  • అరకప్పు నువ్వులు
  • పావు కప్పు మినపప్పు
  • 10 ఎండు మిర్చిలు (మిర్చిల కారాన్ని బట్టి)
  • 6 అల్లం ముక్కలు (సన్నగా తరగాలి)
  • ఓ టేబుల్‍స్పూన్ ధనియాలు
  • ఓ టేబుల్‍స్పూన్ ఆమ్‍చూర్ పొడి
  • రెండు టీస్పూన్‍ల నూనె
  • ఓ టేబుల్‍స్పూన్ జీలకర్ర
  • ఓ రెండు రెబ్బల కరివేపాకు
  • తగినంత ఉప్పు

మునగాకు నువ్వుల పొడి తయారీ విధానం

  • ముందుగా మునగాకును ఆరబెట్టుకోవాలి. తేమ ఆరిపోయే వరకు ఎండబెట్టాలి.
  • అడుగు మందంగా ఉండే ఓ కళాయిలో ముందుగా నువ్వులు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు వేసి వేపుకోవాలి. మంటను తక్కువగా పెట్టి బాగా వేపుకోవాలి. ఎక్కువ మంట ఉంటే లోపల పప్పు సరిగా వేగదు. అందుకే టైమ్ పట్టినా తక్కువ మంటపైనే వీటిని వేయించుకోవాలి. ఆ తర్వాత వేగిన వీటిని ఓ ప్లేట్‍లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత కళాయిలో ఎండిన మునగాకును వేయించుకోవాలి. అందులోనే ఆమ్‍చూర్ పౌడర్ వేయాలి. ఓ నిమిషం పాటు మునగాకును ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఓ కళాయిలో ఓ టీస్పూన్ నూనెను వేసుకొని వేడయ్యాక తరిగిన అల్లం ముక్కలు వేయించుకోవాలి. అవి ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి.
  • అందులోనే మరో టీస్పూన్ నూనె పోసుకోవాలి. అందులో ఎండుమిర్చిని వేసి వేపుకోవాలి. కాస్త రంగు మారగానే తీసేసుకోవాలి.
  • వేయించుకున్నవి అన్నీ చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి.
  • ఆ తర్వాత వేయించుకున్న నువ్వులు, మినప్పప్పు సహా మిగిలినవి, మునగాకు, ఎండుమిర్చి అన్నీ మిక్సీజార్‌లో వేయాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి. అన్నింటినీ మిక్సీలో పొడిలా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉంటే తినేందుకు రుచి ఇంకా బాగుంటుంది. అంతే మునగాకు నువ్వుల పొడి రెడీ అవుతుంది.

ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే నెల వరకు కూడా మునగాకు నువ్వుల పొడి తాజాగా ఉంటుంది. అన్నం, దోశలు, చపాతీలు, రొట్టెలతో ఈ పొడిని తినొచ్చు. ఇది రెగ్యులర్ తింటే శరీరంలో రక్తం పెరిగేలా ఇందులోని ఐరన్ తోడ్పడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here