దేశంలో ఓలా ఎలక్ట్రిక్‌కి, ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లకు కష్టాలు కొనసాగుతున్నాయి! ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీస్ గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. సర్వీస్ బాగోలేదన్న కారణంగా ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్‌ని కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి తగలబెట్టిన వార్త వినే ఉంటారు. ఇక ఇప్పుడు.. మరో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఓనర్ షోరూమ్ ముందే, తన వాహనాన్ని సుత్తితో ధ్వంసం చేశాడు. ఈవీని కొనుగోలు చేసిన నెల రోజుల్లోనే రూ.90,000 సర్వీసింగ్ బిల్లు వచ్చిందని, అందుకే ఇలా చేసినట్టు అతను చెప్పుకోచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.