తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు నిర్వహించనున్న కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నవంబరు 26న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. పద్మావతి అమ్మవారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహిస్తారు. ఆ తరువాత కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు. ఇందులోభాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
Home Andhra Pradesh తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు- ఆర్జిత, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు-tiruchanoor karthika brahmotsavam nov...