బాలికలు ఇలా పాఠశాలలకు దూరమవడం వల్ల.. బాల్య వివాహాలు, చిన్నవయసులోనే తల్లులవడం, బాల కార్మికులుగా మారడం, అక్రమ రవాణాకు గురవడం వంటి ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు. భారతదేశంలోని బాలికలందరూ 18 ఏళ్ల వయసు వరకూ చదువుకునేలా, స్కూళ్లు, కాలేజీల్లో కొనసాగేలా చూడడం లక్ష్యంగా క్రై సంస్థ ఈ ఏడాది ‘పూరీ పఢాయి – దేశ్ కీ భలాయి’ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా ‘వాక్ టు ఎంపవర్ హర్’ అవగాహన నడకలు నిర్వహిస్తోంది. బాలికలు పూర్తిగా చదువుకునేలా పరిస్థితులను మెరుగుపరచటం కోసం ప్రభుత్వ విభాగాలు, కార్పొరేట్ సంస్థలు, పౌర సమాజాలతో కలిసి క్రై సంస్థ పని చేస్తోంది’’ అని వివరించారు.