సినీ నటుడు, కమెడియన్ అలీకి లీగల్ నోటీసులు పంపారు అధికారులు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీ అలీకి నోటీసులు ఇచ్చింది. పంచాయతీ అనుమతి లేకుండా ఫామ్‌హౌస్‌లో నిర్మాణాలు చేపట్టారని నోటీసుల్లో పేర్కొంది. ఎక్ మామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి…ఈ మేరకు సినీనటుడు అలీకి నోటీసులు జారీ చేశారు. ఫామ్ హౌస్ లోని నిర్మాణాలను వెంటనే ఆపివేయాలని ఆదేశించారు. ఎక్మామిడి పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 345లోని ఫామ్‌హౌస్‌లో నూతన నిర్మాణాలకు సంబంధించి తగిన పత్రాలు సమర్పించి, అనుమతులు పొందాలంటూ గతంలోనే అలీకి నోటీసులు ఇచ్చారు.