Tv Shows Trp Ratings: తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఈ వీక్ కూడా బిగ్‌బాస్ టాప్‌లో నిలిచింది. వీకెండ్స్‌తో పాటు వీక్‌డేస్‌లో బిగ్‌బాస్ హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో వీకెండ్స్‌లో బిగ్‌బాస్‌కు అర్బన్ రూరల్ ఏరియాల్లో కలిపి 5.28 టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. వీకెండ్స్‌లో అర్బన్ ఏరియాలో బిగ్‌బాస్ చక్కటి ఆదరణను సొంతం చేసుకుంటోంది. 6.54 టీఆర్‌పీని దక్కించుకున్నది. వీకెండ్స్‌తో పోలిస్తే వీక్‌డేస్‌లో మాత్రం బిగ్‌బాస్ క్రేజ్ కొంత తగ్గింది. వీక్‌డేస్‌లో అర్బన్ రూరల్ ఏరియాల్లో కలిపి 4.25 టీఆర్‌పీ రేటింగ్, అర్బన్ ఏరియాలో 5.32 టీఆర్‌పీ వచ్చింది.