IPL 2025 Mega Auction Live: ఐపీఎల్ 2025 ఆటగాళ్ల మెగా వేలంలో పాత రికార్డుల బద్ధలవుతూ.. కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రూ.2 కోట్లు కనీస ధరతో వచ్చిన భారత క్రికెటర్ల కోసం వేలంలో కోట్లాది రూపాయల్ని ఫ్రాంఛైజీలు కుమ్మరిస్తున్నాయి. రూ.27 కోట్లకి వేలంలో అమ్ముడుపోయిన రిషబ్ పంత్.. ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధరకి అమ్ముడుపోయిన ప్లేయర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. అతడ్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. పంత్ తర్వాత ఈ రికార్డ్‌లో శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు. శ్రేయాస్‌ను రూ.26.75 కోట్లకి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. అనూహ్యంగా కొంత మంది స్టార్ క్రికెటర్లు కూడా అన్‌సోల్డ్‌గా మిగిలారు.