ఈ ట్రైన్లో మొత్తం 14 బోగీలు ఉన్నాయి. వాటిల్లో దాదాపు 10 బోగీలు నిత్యం ఖాళీగానే ఉంటున్నాయి. అయితే.. ఖాళీగా నడపటం కంటే.. వేరే రూట్లో నడిపిస్తే బాగుటుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. బోగీలను తగ్గించి, మరో మార్గంలో ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. ఈ రైలు విశాఖపట్నం- దుర్గ్ మధ్య 9 స్టేషన్లలో ఆగుతుంది. విజయనగరం, పార్వతీపురం, రాయగడ, కేసింగ, తిట్లాఘర్, కంతబంజి, కరియార్ రోడ్, మహాసముంద్, రాయ్పూర్ స్టేషన్లలో ఆగుతుంది.
Home Andhra Pradesh ఈ వందేభారత్ ఎక్స్ప్రెస్లో బోగీలన్ని ఖాళీ.. డిమాండ్ లేని రూట్లో ఎందుకు?-there is no demand...