ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఆటగాళ్ల కోసం స్వేచ్ఛగా కోట్లాది రూపాయల్ని కుమ్మరించేసింది. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుని విజేతగా నిలిపిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు వెచ్చించింది. అలానే భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (రూ.18 కోట్లు), ఆస్ట్రేలియా హిట్టర్లు మార్కస్ స్టోయినిస్ (రూ.11 కోట్లు), గ్లెన్ మాక్స్వెల్ (రూ.4.2 కోట్లు)లను పంజాబ్ కొనుగోలు చేసింది. ఇక డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ కోసం ఏకంగా రూ.18 కోట్లు వెచ్చించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.