ఐపీఎల్ 2025 మెగా వేలం ఆదివారం ముగిసేసరికి.. దాదాపు అన్ని ఫ్రాంఛైజీలు ముప్పావు శాతం డబ్బుని ఖర్చుచేసి తమ కోర్ టీమ్‌ను కొనుగోలు చేసేశాయి. ఇక వేలంలో రెండోజైన సోమవారం పూర్తి జట్టుని సిద్ధం చేసుకోనున్నాయి. ఆదివారం భారత స్టార్ క్రికెటర్లపై కోట్ల వర్షం కురవగా.. కొంత మంది విదేశీ ఫాస్ట్ బౌలర్లు, ఆల్‌రౌండర్లు జాక్‌పాట్ కొట్టారు.