ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)సుకుమార్(sukumar)కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ 1 ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరకి తెలిసిందే. దీంతో ఇప్పుడు సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2(pushpa 2)పై అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.రష్మిక(rashmika)హీరోయిన్ గా చేస్తుండగా శ్రీలీల(sreeleela)ఒక ప్రత్యేకమైన సాంగ్ లో చేస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఆ సాంగ్ నిన్న చెన్నై వేదికగా రిలీజయ్యింది.

ఆ ఈవెంట్ లో దేవిశ్రీప్రసాద్(devisriprasad)మాట్లాడుతు మా నిర్మాతలు ఫంక్షన్ ని రాంగ్ టైంలో వచ్చాడని అన్నారు. నన్నేం చేయమంటారు బయట కెమెరా వాళ్ళుని దాటుకొని లోపలకి రావడానికి టైం పట్టింది. అందుకని ఇప్పుడు స్టేజ్ మీద ఎక్కువ సేపు మాట్లాడానని అనద్దు.టైంకి పాట ఇవ్వలేదు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు. ప్రోగ్రాం కి రాలేదని అనకండి. మీకు నా మీద చాలా ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నప్పుడు కంప్లైంట్స్ కూడా ఉంటాయి. కానీ నా మీద ప్రేమ కంటే కంప్లంట్స్ ఎక్కువ ఉంటాయేంటో అర్ధం కాదు.  ఇవన్నీ సపరేట్ గా అడిగితే కిక్ ఉండదు. ఇలా ఓపెన్ గా అడిగెయ్యండి నేనెప్పుడూ ఓపెన్. మనకి ఏం కావాలన్నా అడిగి తీసుకోవాలి.ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వచ్చే మన డబ్బైనా,స్క్రీన్ మీద వచ్చే మన క్రెడిట్ అయినా అడిగి తీసుకోవాలి. అడగకపోతే ఎవరు ఇవ్వరని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో దేవి శ్రీ ప్రసాద్ కామెంట్స్ వైరల్ గా నిలిచాయి.

ఇక పుష్ప 2  ప్రారంభ సన్నివేశాలకి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్, శ్యామ్ అజనీశ్ వంటి సంగీత దర్శకులు వర్క్ చేసారు. ఈ విషయంలో కారణాన్ని పక్కన పెడితే సంగీత దర్శకుడిని మార్చాలన్న నిర్ణయం నిర్మాతలది కాదు. అల్లు అర్జున్, సుకుమార్ కలిసి తీసుకున్న నిర్ణయం అనే వార్తలు వచ్చాయి. కాబట్టి దేవిశ్రీప్రసాద్ ఏమైనా అనాలి అనుకుంటే వాళ్లని అనాలి తప్ప నిర్మాతలని కాదనే అభిప్రాయాన్ని కొంత మంది సినీ ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here