లగచర్లలో దళిత,గిరిజన రైతులపై రేవంత్ సర్కారు అనుసరించిన తీరుకు నిరసనగా మహబూబాబాద్ జిల్లాలో BRS పార్టీ మహాధర్నా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ పై నిప్పులు చెరిగారు. అల్లుడు, అదానీ కోసమే పేదల భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. నల్ల చట్టాలపై మోడీ సర్కారు ఇది వరకే రైతుల పవర్ చూసిందని గుర్తు చేశారు. అలా రేవంత్ కూడా అవుతుందని హెచ్చరించారు కేటీఆర్.