సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్ లోని తన డెన్ హౌస్ వద్ద ఒంగోలు పోలీసులు ఉన్నారు. విచారణకు రావాలని పదే పదే ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ, తప్పించుకొని తిరుగుతున్నారు. అటు హైకోర్టులోనూ ఆర్జీవీకి నిరాశ ఎదురైంది. దీంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు సమాయత్తం అయ్యారు.