రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఒకరికొకరు గిఫ్ట్ లు ఇచ్చిపుచ్చుకోవడం కామన్. ప్రేమికులైనా, భార్యాభర్తలైనా అకేషన్ ని బట్టి, వారి స్థోమతకు తగ్గట్టుగా గిఫ్ట్ లు ఇచ్చుకుంటూ ఉంటారు. సెలబ్రిటీలు అయితే కొంచెం కాస్ట్ లీ గిఫ్ట్ లు ఇచ్చుకుంటారు. అంత మాత్రాన ఆ గిఫ్ట్ లను ఖరీదులో వెలకట్టలేము. ఎందుకంటే ఆ గిఫ్ట్ లు అనేవి.. పార్టనర్ మీద ప్రేమతో, జీవితాంతం కలిసుంటామన్న ఉద్దేశంతో, మనస్ఫూర్తిగా ఇచ్చుకునేవి. అందుకే, ఏవైనా మనస్పర్థలు వచ్చి విడిపోయినంత మాత్రాన.. ఆ గిఫ్ట్ లకు డబ్బులు వృధా అయ్యాయని అనుకోవడం కరెక్ట్ కాదు. కానీ సమంత (Samantha) మాత్రం అదే అభిప్రాయంలో ఉంది. గతంలో తన మాజీ భర్త నాగచైతన్యకు ఇచ్చిన కాస్ట్ లీ గిఫ్ట్ లతో తన డబ్బు వృధా అయిందనే భావనలో ఆమె ఉంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత, నాగ చైతన్య (Naga Chaitanya).. మనస్పర్థల కారణంగా నాలుగేళ్లకే విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి సమంత ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విడాకుల గురించి పలు వేదికలపై ప్రస్తావిస్తూనే ఉంది. దీంతో ఆమె తీరుపై అక్కినేని అభిమానులు గుర్రుగా ఉన్నారు. మరోవైపు, నాగ చైతన్య మాత్రం ఇంతవరకు విడాకులపై పెద్దగా స్పందించలేదు. విడాకుల గురించి మీడియా నుంచి ప్రశ్నలు ఎదురైనా.. అది తమ వ్యక్తిగతం అంటూ ఎక్కువగా స్పందించడానికి ఇష్టపడలేదు. అలాగే త్వరలో శోభితా ధూళిపాళ్లతో రెండో పెళ్ళికి కూడా సిద్ధమవుతున్నాడు. ఇలాంటి సమయంలో మరోసారి అక్కినేని అభిమానులకు ఆగ్రహం తెప్పించింది సమంత.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో “మీరు దేనికైనా భారీగా ఖర్చు పెట్టి, ఆ తర్వాత వృధా అయిందని భావించారా?” అనే ప్రశ్న సమంత ఎదురైంది. ఈ ప్రశ్నకు సమంత ఏమాత్రం తడుముకోకుండా, “నా మాజీకి ఇచ్చిన కాస్ట్ లీ గిఫ్ట్ లు” అంటూ సమాధానమిచ్చింది. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. సమంత కామెంట్స్ పై అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు. రిలేషన్ లో ఉన్నప్పుడు ఇచ్చిన గిఫ్ట్ లకు ఎవరైనా లెక్క కడతారా? అని ఫైర్ అవుతున్నారు. చైతన్య ది చాలా రిచ్ ఫ్యామిలీ అని, అలాంటి గిఫ్ట్ లు ఆయనకొక లెక్కా? అని ప్రశ్నిస్తున్నారు. రిలేషన్ బాగున్నప్పుడు చైతన్య కూడా ఎన్నో కాస్ట్ లీ గిఫ్ట్ లు ఇచ్చి ఉంటాడు కదా.. మరి వాటి సంగతేంటి? అని నిలదీస్తున్నారు. మీరు ఆయనకు ఇచ్చిన గిఫ్ట్ లు వృధా అయినప్పుడు, మీరు ఆయన దగ్గర తీసుకున్న గిఫ్ట్ లు కూడా వృధానే కదా? అని క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఇదంతా కాదు.. విడిపోయాక చైతన్య తన పనేదో తాను చేసుకుంటుంటే, పదే పదే తన ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? అంటూ సమంతపై సోషల్ మీడియా వేదికగా అక్కినేని అభిమానులు కాస్త ఘాటుగానే విమర్శలు గుప్పిస్తున్నారు.