ఫీచర్స్​ విషయానికి వస్తే, స్కోడా స్లావియా ఫేస్​లిఫ్ట్ 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, మెరుగైన కనెక్టెడ్ కార్ టెక్నాలజీలను కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అలాగే, ఇది కొత్త ఇంటీరియర్ ట్రిమ్​లు, కలర్ స్కీమ్​లను పొందవచ్చు. రాబోయే ఫేస్​లిఫ్ట్​లో ఒక ప్రధాన అప్​డేట్ కొత్త ఆటోమేటిక్ గేర్ బాక్స్! దీనిపై చెక్ కార్ల తయారీ సంస్థ గత కొంతకాలంగా పనిచేస్తోంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది. ఇది వినియోగదారులకు స్మూత్​ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ సెడాన్ 1.0-లీటర్ టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ టర్బోఛార్జ్​డ్​ పెట్రోల్ మోటార్​తో కొనసాగుతుంది. కొత్త ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్ మినహా, సెడాన్ మిగిలిన గేర్​బాక్స్​ ఆప్షన్స్​ యథాతథంగా కొనసాగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here