IPL 2025 Auction CSK Team: ఐపీఎల్ 2025 మెగా వేలం సోమవారం రాత్రి ముగిసింది. రూ.55 కోట్లతో వేలానికి వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ.. రూ.5 లక్షలు మినహా.. మిగిలిన డబ్బుని ఆటగాళ్ల కొనుగోళ్ల కోసం వెచ్చించేసింది. టీమ్‌లో గరిష్టంగా 25 మంది ప్లేయర్లు ఉండే వెసులుబాటు ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ అన్ని స్లాట్స్‌ను భర్తీ చేయడం గమనార్హం. ఇందులో 18 మంది భారత్ ఆటగాళ్లు, 7 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు.