సూర్య(suirya)హీరోగా శివ9siva)దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘కంగువ'(kanguva)ఈ నెల 14 న వరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే.ట్రైలర్ తో పాటు ప్రచార చిత్రాలనుంచే అన్ని భాషల్లోను మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీ, విడుదలయ్యాక మాత్రంప్రేక్షకులని పెద్దగా మెప్పించలేకపోయింది.
ఇప్పుడు ఈ విషయంపై కంగువ నిర్మాతలలో ఒకరైన ధనుంజయ్(dhanunjay)మాట్లాడుతూ కంగువ మేము అనుకున్న విజయాన్ని సాధించలేదు.ఇందుకు కారణం కోలీవుడ్ లోని ఇద్దరు అగ్ర హీరోల అభిమానులే. రెండు పెద్ద రాజకీయ పార్టీలు కూడా అభిమానులకి అండగా ఉన్నాయి.దాంతో వాళ్లంతా సూర్యని టార్గెట్ చేసి ఆయన సినిమాలు ఆదరణ పొందకుండా చేస్తున్నారు.సూర్య పై స్థాయికి ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు.ధనుంజయ్ చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
రీసెంట్ గా కంగువ గురించి సూర్య భార్య జ్యోతిక(jyothika)కూడా మాట్లాడుతు మూడు గంటల సినిమాలో మొదటి అరగంట అనుకున్న స్థాయిలో లేదు.కొన్ని సన్నివేశాల్లో సౌండ్ ఎక్కువగా ఉంది.ఎన్నో చిత్రాల్లో లోపాలు ఉంటాయి.ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో చిన్న చిన్న లోపాలు ఉండటం పెద్ద విశేషం కాదు.టోటల్ గా సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చింది.