ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(ar rahman)ఆయన భార్య సైరా భాను(syra bhanu)ఇరవై తొమ్మిదేళ్ల తమ వివాహబంధానికి స్వస్తి చెప్తున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ విషయంపై మా ఇద్దరికి ప్రైవసీ కావాలని సోషల్ మీడియా వేదికగా కూడా అందర్నీ వేడుకున్నారు.కానీ రెహమాన్ విడాకులు తీసుకోవడానికి ఆయన బృందంలోని మోహినీదే అనే వార్తలు గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నాయి.వాటిపై ఆమె తన స్పందనని కూడా తెలియచేసింది.

ఇప్పుడు రీసెంట్ గా మరోసారి  మోహినిదే(mohini dey)ఒక వీడియో రిలీజ్ చేసింది.అందులో ఆమె మాట్లాడుతూ రెహ్ మాన్ గారు ఒక లెజండ్ మాత్రమే కాదు.నా జీవితానికి ఒక రోల్ మోడల్.నా కెరీర్లో కీలక పాత్ర పోషించారు.నాది రెహమాన్ కుమార్తెలది ఒకే వయసు.దాంతో ఆయనెప్పుడూ నన్ను కూడా ఒక కూతురులా చూసుకునే వారు.ఎనిమిదేళ్ళకి పైగా ఆయన బృందంలో పని చేశాను.ఆయనంటే ఎంతో గౌరవం ఉంది.ఎన్నో సినిమాలకి ఆయనతో కలిసి మ్యూజిక్ ని అందించడమే కాకుండా,ఎన్నోస్టేజ్ షోస్ కూడా చేశాను.సున్నితమైన అంశాల్లో సానుభూతి లేకుండా నిందలు వెయ్యడం సరి కాదు.అవి సృష్టించిన వారి మానసిక పరిస్థితి చూస్తే జాలివేస్తుంది.అసభ్యంగా మాట్లాడటం నేరంగా పరిగణించాలి

.నాకు సంగీతం నేర్పిన తండ్రిని ఏడాది క్రితం కోల్పోయాను.దాంతో .అప్పట్నుంచి రెహ్ మాన్ బృంద సభ్యులే సొంత వారిలా ఆదరిస్తున్నారు. మీడియాకి వ్యక్తుల మనసుతో పని లేదు.ఇలాంటి వార్తలు నా కెరియర్ కి అంతరాయం కలిగించవని చెప్పుకొచ్చింది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here