అక్కినేని ఇంట వరుసగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య డిసెంబర్ 4న శోభిత ధూళిపాళను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ కూడా పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. (Akhil Akkineni Engagement)

జైనాబ్ రావడ్జీతో నేడు అఖిల్ ఎంగేజ్ మెంట్ అయింది. ఈ విషయాన్ని తాజాగా అక్కినేని ఫ్యామిలీ ప్రకటించింది. కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. వచ్చే ఏడాది వివాహం జరగనుంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here