సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో వాటికి ఆమోదాన్ని తెలియచేశామని, త్వరలోనే వీటి తుది డిజైన్లకు సంబంధించిన ఉత్తర్వులు ఇస్తామన్నారు. గత ప్రభుత్వం ఎలాంటి నోటీసు లేకుండా టెండర్లు రద్దు చేయటంతో నార్మన్ పోస్టర్స్ ఆర్బిట్రేషన్ వేసిందని, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంలో వారికి 9 కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. ఫలితంగా మళ్లీ రీటెండర్ పిలవాల్సి వచ్చిందని, రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించి పనులు త్వరలోనే మొదలు అవుతాయని చెప్పారు. ప్రపంచ బ్యాంకు రుణానికి ఎలాంటి ఇబ్బంది లేదు, దశలవారీగా రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే ముందుకు వచ్చిందని, రాజధానికి సంబంధించి కేంద్రం నుంచి నోటిఫికేషన్ వస్తుందని మంత్రి నారాయణ చెబుతున్నారు.
Home Andhra Pradesh అమరావతిని ఏపీ రాజధానిగా కేంద్రం గుర్తించేలా చర్యలు… జూన్ 2తో ముగిసిన ఉమ్మడి రాజధాని-ap government...